Saturday, July 23, 2011

టీచర్  : రాజూ ! మీ న్నాన్నగారు ఏం చేస్తుంటారు ?
రాజు   : మా అమ్మ ఏం చెబితే అది ...!



టీచర్  : మన దేశంలో 1947 లో ఏమైందో చెప్పు బబ్లూ ?
బబ్లూ  : మనకు స్వాతంత్ర్యం వచ్చింది టీచర్ ...
టీచర్  : వెరీగుడ్. మరి 1957 లో ఏమైంది ?
బబ్లూ  : మనకు స్వాతంత్ర్యం వచ్చి పదేళ్లు అయ్యింది ...!



రామరాజు : డాక్టర్ గారు ! మీరిచ్చిన మందులు మంచి పనిచేశాయి
డాక్టర్     : అలాగా ! ఎన్ని రోజులు వేసుకున్నావ్ ?
రామరాజు: వేసుకుంది నేను కాదు డాక్టర్, మా మావయ్య. ఇప్పుడు ఆస్తంతా నాదే ...!



వెంగలప్ప : కుక్క కరిచింది డాక్టర్ ...
డాక్టర్    : ఎక్కడ ?
వెంగలప్ప : రోడ్డు పైన ...
డాక్టర్    : ఓహో ! పిచ్చి కుక్క కరిచిందన్న మాట !
భార్య : ఆ పుస్తకంలో రాసున్నట్టే అన్నీ గిన్నెలో వేసినా వంటకం పూర్తవడం లేదేంటండీ?
భర్త   : పుస్తకంలో రాయలేదని స్టవ్ వెలిగించకపొతే ఎలాగవుతుంది ?



కస్టమర్ : నన్ను ఎందుకు మోసం చేసారు?
షాపు వాడు: ఏం చేసాను సార్?
కస్టమర్ : నూనె ప్యాకెట్ మీద "కొలస్ట్రాల్ ఫ్రీ" అని రాసున్నా ఇవ్వలేదుగా !



శివ : మా క్లాసులో నేనే ఫస్ట్ తెలుసా?
పవన్: ఎందులో?
శివ : రోల్ నెంబర్ లో ...!



ముసలాయన : కుచ్చు లేని టూత్ బ్రష్ కావాలి
షాపు వాడు: ఎందుకు సార్?
ముసలాయన : నా నోట్లో పళ్ళు లేవుగా మరీ !



టీచర్: రవి, ఎదుటి వాళ్లకు ఆసక్తి లేకున్నా మాట్లాడే వాళ్ళను ఏమనాలి ?
రవి: టీచర్ ...



టీచర్: నీళ్ళలో రాయి మునుగుతుంది. కప్ప తేలుతుంది ఎందుకు ?
రాజు: కప్పకి ఈత వచ్చు, రాయికి రాదు కదా అందుకు !



జడ్జి : నువ్వు నీ భార్యను మేడ మీంచి తోసేసావా ?
నిందితుడు : అవున్సార్... సారీ !
జడ్జి : సారీ ఏంటయ్యా ? దారిన పోయే వారికి అదెంత ప్రమాదమో ఒక క్షణమైనా ఆలోచించావా ? !!!



చంటి : నాన్నా! నా సంతకం చూసి టీచర్ చాలా మెచ్చుకున్నారు.
తండ్రి : ఏమని ?
చంటి : నువ్వు పెద్దయితే డాక్టర్ వి అవుతావు అన్నారు.

జైలులో ఖైదీల సంభాషణ...

మొదటివాడు  :  ఏం చేశావు? 
రెండోవాడు     : బ్యాంకుకు కన్నమేశా.....
మొదటివాడు  : మరెలా దొరికిపోయావ్ ?
రెండోవాడు     : అక్కడే లెక్కెట్టుకుంటుంటే తెల్లారిపోయింది!
టీచర్ : బబ్లూ! నీ వయసెంత?
బబ్లూ : ఇంట్లోనా, బస్సులోనా టీచర్...!


బుజ్జి  : ఈ మధ్య కాళ్ళు నొప్పులుగా ఉంటున్నాయి డాక్టర్ గారు!
డాక్టర్ : మీకు వ్యాయామం అవసరం. రోజుకి నాలుగు కిలోమీటర్లయినా నడవండి!
                   (కొన్ని రోజుల తరువాత)
బుజ్జి  : డాక్టర్ గారు! రోజుకి నాలుగు కిలోమీటర్ల చొప్పున నడుచుకుంటూ ఇప్పటికి మా ఊరి నుంచి హైదరాబాద్ చేరుకున్నాను. ఇంకా ఎంత దూరం నడవమంటారు?
సుబ్బు   : ఏంట్రా! కుర్చీలో కూర్చుని అలా తాళ్ళతో కట్టేసుకుంటున్నావు? 
వెంగలప్ప : భూమి సూర్యుని చుట్టూ తిరుగుతోందని మా చంటోడు ఇందాకటి నుంచి చదువుతున్నాడురా! పడిపోతానేమోనని!


కొడుకు : ఆపరేషన్ థియేటర్ లో నువ్వు మాస్క్ ఎందుకు వేసుకుంటావ్ నాన్న ? 
తండ్రి   : పొరపాటు జరిగితే ఎవరూ గుర్తుపట్టకుండా ఉండడానికి...!
  

టీచర్ : పెద్దయ్యాక ఏం అవుతావు?
బబ్లూ : పశువుల డాక్టర్ 
టీచర్ : ఎందుకలా?
బబ్లూ : జంతువులైతే మన మీద కేసులు పెట్టవుగా ...!
టీచర్   : అబద్ధం చెప్పడం నేరం.
విద్యార్ధి : అయితే రేపు పరీక్షలో ఇచ్చే ప్రశ్నలేంటో నిజం చెప్పండి సార్


టీచర్   : రోజూ నాకొక బాదంపలుకు ఎందుకు ఇస్తున్నావ్ టింకూ?  
టింకూ : అది నాకిష్టముండదు టీచర్! 
టీచర్   : మరి ఎందుకు కొంటున్నావ్? 
టింకూ : దాని చుట్టూ ఉండే చాక్లెట్ నాకిష్టం...!


వెంగలప్ప   : ఈ రేడియోలో అన్ని స్టేషన్లూ వస్తాయన్నారు, రావట్లేదేం?
షాపువాడు : మీకే  స్టేషన్లు కావాలి ?
వెంగలప్ప   : పోలీసు స్టేషన్ , రేడియో స్టేషన్!

లంబు-జంబు

లంబు : ఇన్ని సార్లు సున్నా మార్కులు  వస్తున్నా,  మీ  నాన్న  చేత  దెబ్బలు  తినకుండా  ఎలా  తప్పించుకుంటున్నావురా జంబు?
జంబు :     కొట్టడానికి  వచ్చినప్పుడల్లా  నేను  'జనగణమన...'  పాడతా. ఆయన   వెంటనే  సెల్యూట్  కొడుతూ  నిలబడిపోతే పారిపోతా !



నవీన్    : పత్రికకు పంపిన నా రచనలు తిరిగి రావొద్దంటే ఏం చేయాలి?
వినయ్  : ఏముంది! ఫ్రం అడ్రస్ రాయకు....! 



తండ్రి    : దేంట్లోనూ ఫస్ట్ రావేంట్రా?
కొడుకు : ఎందుకురానూ? బెల్ కొట్టగానే బయటకొచ్చేది ఫస్ట్ నేనేగా...!