Thursday, August 18, 2011

సుబ్బారావు  తన  పెంపుడు  కుక్కను  అప్పారావుకు  అమ్ముతున్నాడు...
సుబ్బారావు :  ఇది  చాలా  మంచి  కుక్క  విశ్వాసం  ఎక్కువ.
అప్పారావు  :  ఎలా  చెప్పగలరు ?
సుబ్బారావు :  ఇప్పటికి  మూడు  సార్లు  అమ్మాను.  మళ్లీ  నా  దగ్గరికే  తిరిగి  వస్తోంది...!



రవి   :  ఇంటి  పని  వంట  పని  చేయలేక  అలసిపోతున్నానురా.  అందుకే  పెళ్లి  చేసుకుంటున్నాను.
రాజు :  అవన్నీ  చేయలేకే  నేను  విడాకులు  ఇచ్చింది...!



జడ్జి   :  నీకు  పట్టుమని  పాతికేళ్లు  లేవు,  ఇన్ని  నేరాలు  చేశావు,  నిన్నేమనాలో  అర్థం  కావడం  లేదు ?
దొంగ :  'నేర సామ్రాట్ ' అనండి...!



బౌలర్ :  నేను  అవతలి  జట్టుని  ఒక్క  సింగిల్  రన్ ని  కూడా  తియ్యనివ్వలేదు  తెలుసా ?
తండ్రి :  అవునా!  మరి  ఆ  జట్టు  ఎలా  గెలిచిందిరా ?
బౌలర్ :  అన్నీ  ఫోర్ లు,  సిక్స్ లు  కొట్టుకుని  గెలిచారు!

Wednesday, August 17, 2011

భార్య : ఏమండీ! నేను చచ్చిపోతే మీరేం చేస్తారు ?
భర్త   :  చచ్చిపోతాను 
భార్య :  నేనంటే  అంత  ఇష్టమా?
భర్త   :  ఒక్కోసారి  ఎక్కువ  సంతోషాన్ని  తట్టుకోలేం  కదా !



టీచర్ :  ఏరా !  హోటల్  స్పెల్లింగ్  రాయమంటే  హెల్  మాత్రమే  రాశావు. T  ఏమైందిరా ?
రాజు  :  తాగేశాను  సార్.



టీచర్ :  రవి !  ఒక  కోడి  రోజూ  రెండు  గుడ్లు  పెడితే  వారానికి  ఎన్ని  అవుతాయి ?
రవి    :  12  గుడ్లు  టీచర్.
టీచర్ :  అదెలా ?
రవి    :  ఆదివారం  సెలవు  కదా  టీచర్ !



రాము  :  నేను  మీ  కాలేజిలో  చేరుతా.
రాజు   :  వద్దురా  సీట్లు  అయిపోయాయి.
రాము  :  పర్వాలేదు,  నేను  ఇంటి  దగ్గర  నుంచి  సీటు  తెచ్చుకుంటా !
డాక్టర్ :  ఏంటి  నీ  జబ్బు ?
కృష్ణ   :  మనిషి  కనిపించడం  లేదు  కాని  మాట  వినిపిస్తుంది  డాక్టర్
డాక్టర్ :  ఎప్పుడు  ఇలా  జరుగుతోంది ?
కృష్ణ   :  ఫోన్ లో  మాట్లాడుతున్నప్పుడు ! 



తండ్రి    :  పిల్లల్ని  పెంచడం  ఎలా  అనే  పుస్తకం  నువ్వు  చదువుతున్నావేంట్రా ?   
కొడుకు :  మీరు  నన్ను  సరిగా  పెంచుతున్నారో  లేదో  తెలుసుకుందామని !



టీచర్  :  నేను  నీకు  రెండు  కుక్కలిచ్చాను. మళ్లీ  రెండిచ్చాను. ఇప్పుడు  మొత్తం  ఎన్ని  కుక్కలు  నీ దగ్గర  ఉన్నట్టు ?
టింకు :  5 కుక్కలు
టీచర్  :  అదెలా ?
టింకు :  ముందే  మా  ఇంట్లో  ఒకటుంది  గనుక...!
డాక్టర్ :  కుక్క  వెంటపడుతుంటే  తప్పించుకోకుండా  ఏం  చేస్తున్నారు ?
రాజు  :  హచ్  కుక్కేమో  అనుకున్నా,  కరిచాక  తెలిసింది  పిచ్చికుక్క  అని !



బిక్షగాడు :  బాబూ!  వంద  ధర్మం  చెయ్యండి.  గుడ్డివాన్నీ
రవి       :  నీకు  కళ్ళు  లేవని  ఎలా  నమ్మాలి ?
బిక్షగాడు :  అక్కడ  చెట్టుకింద  ముగ్గురు  కూర్చుని  ప్రసాదం  తినడం  మీరు  చూస్తున్నారా?  నాకు  కనిపించడం  లేదు బాబూ !
రవి       :  అయ్యోపాపం!  ఇదిగో  వంద...!



టీచర్ :  భరత్ !  సూర్యుడు  ఎటు  ఉదయిస్తాడు ?
భరత్ :  మా  ఇంటి  వెనకాల  వైపు  టీచర్...!



యజమాని :  ఒరేయ్ !  కవరు  అంటించమని  చెప్పాను,  అంటించావా ?
వెంగళప్ప   :  అంటించాను  సార్.  అగ్గిపుల్ల  దొరక్కపోతే  గ్యాస్ స్టవ్  మీద  అంటించేశాను.
డాక్టర్       :  మీ  భార్య  మరో  రెండు  గంటలు  మాత్రమే  బతుకుతుంది .
సుబ్బారావు :  పర్లేదు  డాక్టర్ !  ఇంత  కాలం  ఆగినవాడిని  రెండు  గంటలు  ఆగలేనా!



రాము :  ఎందుకలా  గుండ్రంగా  తిరుగుతున్నావ్ ?
రాజు  :  ఫోన్  చేస్తే  తిరిగి  ప్రయత్నించండి  అంటేనూ...!



అంకుల్ :  బడికి  వెళ్తున్నావా  బాబు ?
బాబు   :  లేదంకుల్...  బలవంతంగా  పంపిస్తున్నారు !



సుబ్బు :  నువ్వు  ప్రయాణిస్తున్న  పడవకి  చిల్లు  పడితే  ఏం  చేస్తావ్ ?
పప్పూ  :  ఇంకో  చిల్లు  పెడతా
సుబ్బు :  ఎందుకలా ?
పప్పూ  :  ఈ  చిల్లు  నుంచి  లోపలికొచ్చే  నీళ్ళు,  రెండో  చిల్లు  నుంచి  బయటకి  వెళ్ళిపోతాయి.

Tuesday, August 16, 2011

కొడుకు : నాన్నా! ICICI అంటే  ఏంటీ ?
నాన్న : ఓస్! అది  కూడా  తెలీదంట్రా ? నేను చూశా...  నేను చూశా...  నేను...  అని అర్థం ...!



సోము  : నీ చెప్పుల జత ఒకటి ఎర్రరంగులో, మరొకటి పచ్చరంగులో భలే వింతగా ఉందేంటి ?
పప్పూ  : అచ్చం  ఇలాంటి  వింత జతే  ఇంట్లో  మరోటి  ఉంది ...!



తల్లి      :  ఇవాళ  బడిలో  ఏం నేర్చుకున్నావ్ ?
కొడుకు :  రాయడం  నేర్పించారు 
తల్లి      :  రాసింది  చదువు 
కొడుకు :  ఏమో ! ఇంకా చదవడం నేర్పలేదు...!