సుబ్బారావు తన పెంపుడు కుక్కను అప్పారావుకు అమ్ముతున్నాడు...
సుబ్బారావు : ఇది చాలా మంచి కుక్క విశ్వాసం ఎక్కువ.
అప్పారావు : ఎలా చెప్పగలరు ?
సుబ్బారావు : ఇప్పటికి మూడు సార్లు అమ్మాను. మళ్లీ నా దగ్గరికే తిరిగి వస్తోంది...!
రవి : ఇంటి పని వంట పని చేయలేక అలసిపోతున్నానురా. అందుకే పెళ్లి చేసుకుంటున్నాను.
రాజు : అవన్నీ చేయలేకే నేను విడాకులు ఇచ్చింది...!
జడ్జి : నీకు పట్టుమని పాతికేళ్లు లేవు, ఇన్ని నేరాలు చేశావు, నిన్నేమనాలో అర్థం కావడం లేదు ?
దొంగ : 'నేర సామ్రాట్ ' అనండి...!
బౌలర్ : నేను అవతలి జట్టుని ఒక్క సింగిల్ రన్ ని కూడా తియ్యనివ్వలేదు తెలుసా ?
తండ్రి : అవునా! మరి ఆ జట్టు ఎలా గెలిచిందిరా ?
బౌలర్ : అన్నీ ఫోర్ లు, సిక్స్ లు కొట్టుకుని గెలిచారు!
No comments:
Post a Comment